ఎటు చూసినా గోవిందనామ స్మరణే.. ఎవరిని కదిలించినా భక్తి భావనే.. దేవదేవుడైన శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వర్ణరథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు..
ఎటు చూసినా గోవిందనామ స్మరణే.. ఎవరిని కదిలించినా భక్తి భావనే.. దేవదేవుడైన శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వర్ణరథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.. విద్యుద్దీపాల వెలుగుల మధ్య మిరుమిట్లు గొలుపుతున్న స్వర్ణరథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. అన్నమయ్య కీర్తనలతో కొన్ని బృందాలు, నృత్యాలతో మరికొన్ని బృందాలు కోలాహలంగా సాగుతుండగా.. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య కరుణావీక్షణాలను ప్రసరిస్తూ సాగిన స్వామివారి విహారం భక్తులను పరవశింపజేసింది.