ప్రజాసంకల్పయాత్ర.. చరిత్రలో చెరగని ఓ మైలురాయి 

Praja Sankalpa Yatra Is A Historic Event Says NRIs In Saudi Arabia - Sakshi

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విజయవంతంపై సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రుల హర్షం

ఉమ్రా యాత్రలో ఉన్న ఎమ్మెల్యే అంజాద్‌ బాషాను కలిసిన ప్రవాసాంధ్రులు

సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

దుబాయ్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో చెరగని ఓ మైలురాయిగా నిలిచిపోతుందని సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడ్డారు. ఉమ్నాయాత్రంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషాను ఆ పార్టీ నేత షేక్‌ సలీమ్‌ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సౌదీలోని పవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి ప్రత్రం అందించారు. అనంతరం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపి,  అంజాద్‌ బాషా చేతుల మీదుగా కేక్‌ కట్‌ చేశారు. 

ఎమ్మెల్యే అంజద్‌ బాషా మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుబడ్డ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి మరో రూపమే జగన్‌ అని ప్రశంసించారు. ప్రజలతో మమేకమవుతూ సాగిన సుదీర్గ ప్రజాసంకల్పయాత్ర అద్భుతమని కొనియాడారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు మరలా సంక్షేమ పాలన జగన్‌ ద్వారానే సాధ్యమన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే వైఎస్‌ జగన్‌ నవరత్నాలను ప్రవేశపెట్టారన్నారు. వైఎస్‌ జగన్‌కు మద్దతుగా రాబోవు ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రవాసాంధ్రుల సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తానని, తప్పకుండా మన ప్రాంత ప్రజలను ఆదుకంటామని వారికి ఎమ్మెల్యే భరోసానిచ్చారు. ముస్లిం మైనార్టీల పట్ల తమ పార్టీ చిత్త శుద్దితో పనిచేస్తుందన్నారు. ప్రతీ విషయం చర్చించి ఇక్కడ నివసిస్తున్న తెలుగువారికి మంచి జరిగేలా చేస్తామని అంజద్‌ బాషా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడప పార్టీ నాయకులు అహ్మద్ బాషా, ప్రవాసాంధ్రులు షేక్ సలీమ్, ఎండీ సిరాజ్, షేక్ ఫరీద్, అమేర్, సిరాజుద్దీన్, సయ్యిద్, పర్వేజ్, ఎండీ ఇర్షాద్, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top