డల్లాస్‌లో ఘనంగా దసరా-బతుకమ్మ సంబరాలు

Bathukammma celebrations in Dallas

డల్లాస్‌: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌ నగరంలో బతుకమ్మ-దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోనే అత్యంత వైభంగా జరిగిన ఈ వేడులకలకు సుమారు 12 వేల మంది హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఒకేచోట చేరి బతుకమ్మ ఆడారు. డా. పెప్పర్‌ ఎరేనాడల్లాస్‌లో నిర్వహించిన ఈ వేడకల్లో వివిధ సంస్కృతిక కార్యక్రమాలతోపాటూ ఆటాపాటలతో యువతి, యువకులు అలరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రిస్కో నగర మేయర్‌ జెఫ్‌ చెనెయ్‌ సెప్టెంబర్‌ 30ను టీపీఏడీ బతుకమ్మ దినోత్సంగా ప్రకటించారు. 

అనంతరం బతుకమ్మ పాటలతో ప్రాంగణం హోరెత్తింది. ఈ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్‌ హీరోయిన్‌ రెజీనా క‌సెండ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సింగర్స్‌ దీపు సమీరా, సాయి శిల్ప, యామినీ భాస్కర్‌, అముల్యా, శ్రావణి, యాంకర్‌ లాస్యలు సందర్శకులను ఉర్రూతలూగించారు. టీపీఏడీ చైర్మెన్‌ ఉపెందర్‌, అశోక్‌ కొండాల, మాధవి సుంకిరెడ్డి, కరణ్‌ పొరెడ్డి, అజయ్‌ రెడ్డి, రఘువీర్‌ బండారు, మహేందర్‌ కోమిరెడ్డి, రావు కల్వాలా, జానకీ మండాది, రాజవర్ధన్‌ గాంధీ, మహేందర్‌ కామిరెడ్డి, అశోక్‌ కొండాల, మనోహర్‌ కాసంగీ, మాధవి సుంకిరెడ్డి, రామ్‌ అన్నాడి, ఇంద్రాణి పంచారుపుల, పవన్‌ గంగాధర, ప్రవీణ్‌ బిల్లా, రాజేంధర్‌ తొడిగాల, రాజ్‌ గోవర్ధన్‌ గాంధీలు తదితరులు పాల్గొన్నారు.


 

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Back to Top