
సాక్షి, తాడేపల్లి(గుంటూరు): అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్త), కాజ సాంబశివరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాట్రగడ్డ శ్రీకాంత్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గురువారం తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన ఈ మెగా ఉచిత మెడికల్ క్యాంప్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, అడిషనల్ డీజీపీ సునీల్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మెగా శిబిరానికి కుంచనపల్లి ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉచిత వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పొందారు.
ఈ మెడికల్ క్యాంప్ దిగ్విజయంగా జరగడానికి తోడ్పడిన మెయిన్ స్పాన్సర్స్ శ్రీకాంత్ కాట్రగడ్డ, డాక్టర్ సూర్య రగతు, డాక్టర్ నీరజ చవాకుల, అమాప్ చైర్ డాక్టర్ సురేష్ అలహరి, లక్ష్మి చిమట, శివ మొలబంటి, శ్రీకాంత్ మన్నెం, బనారసీ తిప్పా, ఇన్నయ్య యనమల, ఈశ్వర్ అరిగే, నాగ కుమారి అరిగే, త్రినాథ్ ముద్రగడ, గోపాల్ గూడపాటి, విజయ్ గుడిశేవ, వెంకట్ చలమల శెట్టి, ఆప్త కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్లు, కుంచనపల్లి గ్రామప్రజలకు ఆప్త ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నటరాజు యిల్లూరి, చైర్ కిరణ్ పల్లాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల భాను ఉదయశంకర్, డాక్టర్ శనక్కాయల రాధా మాధవి, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ బిందేశ్ దాది, డాక్టర్ లంకా దుర్గ కళ్యాణ్, డాక్టర్ చప్పిడి అరుణ్ కుమార్, డాక్టర్ నరాలశెట్టి అనిల్ కుమార్, డాక్టర్ తోట నవీన్ కుమార్, డాక్టర్ కాట్రగడ్డ పృథ్వీరాజ్, డాక్టర్ పోతుల పవన్ సాయి, డాక్టర్ చాగంటి సింధు, డాక్టర్ చిద్రుపుపి, డాక్టర్ నందిని, మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్ అమూల్య గోవాడ, డాక్టర్ గిరీష్, డాక్టర్ రేష్మ, ఆపరేటర్ లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొని వైద్యసేవలను అందించారు.