రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతూ బుధవారం వైఎస్సార్‌సీపీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనుందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ తెలిపారు.
ఢిల్లీ: రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతూ బుధవారం వైఎస్సార్‌సీపీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనుందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, మేకా శేషుబాబు తెలిపారు. ఈ రోజు రాష్ట్రపతిని, ప్రధానిని కలసిన వైఎస్సార్‌సీపీ బృందం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విన్నవించామన్నారు. సమన్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పేర్కొన్నట్లు తెలిపారు. ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1గం. వరకూ నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.
గతంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పి వెనుతిరగడాన్ని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జడిసే వెనక్కు తగ్గారని ఆయన ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ నేతలకు ప్రజలపై మమకారం లేకపోవడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ దివాళ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి కష్టాల్లో ఉన్నా.. ప్రజల గురించి ఆలోచించి జైల్లోనే దీక్షకు పూనుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు.