'సీనియర్ ఐపీఎస్ లైంగికంగా వేధిస్తున్నారు..' | Woman staffer accuses senior IPS officer of molestation | Sakshi
Sakshi News home page

'సీనియర్ ఐపీఎస్ లైంగికంగా వేధిస్తున్నారు..'

Feb 17 2015 2:37 PM | Updated on Jul 23 2018 8:49 PM

'సీనియర్ ఐపీఎస్ లైంగికంగా వేధిస్తున్నారు..' - Sakshi

'సీనియర్ ఐపీఎస్ లైంగికంగా వేధిస్తున్నారు..'

సీనియర్ ఐపీఎస్ అధికారి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా ఉద్యోగి (32) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముంబై: సీనియర్ ఐపీఎస్ అధికారి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా ఉద్యోగి (32) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలో అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారి కార్యాలయంలో ఆమె క్లర్క్గా పనిచేస్తున్నారు. కొలాబా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఐపీఎస్ అధికారి ఆయన కార్యాలయంలో సోమవారం తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, తనను తాకారని మహిళా ఉద్యోగి ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం తన వివాహం, కుటుంబ సభ్యుల గురించి అడిగారని వెల్లడించారు. తన మొబైల్కు తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నారని తెలిపారు.

ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, బాధితురాలి ఆరోపణలపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులు లేరని, అయినా నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నామని ఓ పోలీసు అధికారి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement