మాజీ భర్త ఘాతుకం : గ్యాంగ్‌రేప్‌, హత్య

Woman Gangraped in Jharkhand, Dies After Stick Inserted in Private Parts - Sakshi

జార్ఖండ్‌ : జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళపై (23) ఆమె మాజీ భర్త, మరో ఇద్దరితో కలిసి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు  అతి దారుణంగా హింసించడంతో ఆమె ప్రాణాలు  కోల్పోయింది.  జంతర జిల్లాలోని నారాయణ పూరా పోలీస్‌ స్టేషన్‌లో  పరిధిలో  బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసు అధికారి బీఎన్‌ సింగ్‌ అందించిన సమాచారం ప్రకారం స్థానిక మహిళ సమీపంలో కాళీపూజా థియేటర్‌లో సినిమా చూడ్డానికి వెళ్లింది.  దీన్ని గమనించిన ఆమె మాజీ భర్త పథకం  పన్నాడు. సినిమా నుంచి తిరిగి వస్తున్న  సమయంలో మరో ఇద్దరితో కలిసి ఆమెను అటకాయించాడు.  సమీపంలోని పొలాల్లోకి తీసుకునిపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అంతటితో  ఆ దుర్మార్గుల ఆగడాలు ఆగిపోలేదు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించారు.  అనంతరం అక్కడ్నించి పారిపోయారు.

మరునాడు ఉదయం నిస్సహాయ స్థితిలో రోదిస్తున్న  ఆమెను గమనించిన స్తానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ బాధితురాలి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో  మెరుగైన చికిత్సకోసం  జంతర సదర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. 

తన మాజీ భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా బాధితురాలు చెప్పిందన్న  గ్రామస్తుల  సమాచారం ఆధారంగా ఆమె మాజీ భర్తతోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని  పోలీసు అధికారి సింగ్  వెల్లడించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top