
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు సాధించి మెజారిటీకి దూరంగా నిలిచిన కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే విషయమిది. ఆ పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులు 3 వేల కన్నా తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. అందులో ముగ్గురు వేయి కన్నా తక్కువ మెజారిటీతో గెలుపునకు దూరమయ్యారు. గోధ్రాలో బీజేపీ అభ్యర్థి సీకే రావుల్జీ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రసిన్హా పర్మార్‌పై కేవలం 258 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ధోల్కాలో 327 ఓట్లు, బోతాడ్‌లో 906 ఓట్లు, వీజాపూర్‌లో 1164 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓటమిపాలైంది. అలాగే హిమత్‌నగర్(1712), గారిధర్(1876), ఉమ్రెత్(1883), రాజ్‌కోట్ (గ్రామీణ–2,179), ఖాంబట్(2318), వాగ్రా(2370),మాతర్(2406), ప్రతీజ్(2551), ఫతేపురా(2711), వీస్‌నగర్(2869)లను కూడా స్వల్ప తేడాతో చేజార్చుకుంది.