శివసేన గూటికి ఊర్మిళ..? | Urmila Matondkar Meets Uddhav Thackerays PA | Sakshi
Sakshi News home page

శివసేన గూటికి ఊర్మిళ..?

Sep 17 2019 11:50 AM | Updated on Sep 17 2019 11:51 AM

Urmila Matondkar Meets Uddhav Thackerays PA - Sakshi

కాంగ్రెస్‌ పార్టీని వీడిన బాలీవుడ్‌ నటి ఊర్మిళా మటోండ్కర్‌ అడుగులు శివసేన దిశగా సాగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది.

ముంబై : కాంగ్రెస్‌ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన నటి ఊర్మిళ మటోండ్కర్‌ శివసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే పీఏ మిలింద్‌ నవ్రేకర్‌తో ఊర్మిళ భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. థాకరే పీఏతో ఊర్మిళ సమావేశం కావడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరలేపింది. మరోవైపు తాను శివసేనలో చేరతాననే ప్రచారాన్ని ఊర్మిళ తోసిపుచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే మిలింద్‌ నవ్రేకర్‌ను కలిశానని చెప్పుకొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ద్వారా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన ఊర్మిళ త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె తదుపరి అడుగులు ఎటు వైపనే ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement