హంద్వారాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్ము,కశ్మీర్‌లోని గత మూడు రోజులుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా కుప్వారా జిల్లా హంద్వారా ఏరియా బాబాగుండ్‌లో ఆదివారం భద్రతాదళాలు...ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో రెండు ఇళ్లు, రెండు గోశాలలు ధ్వంసమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా గత మూడు రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఇద్దరు జమ్ము,కశ్మీర్ పోలీసులు ఉన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి