
భార్య మద్దతు వల్లే ఈ విజయం
‘‘నా భార్య నాతో వెన్నంటి ఉండి మద్దతు తెలపడం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది.
కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ‘‘నా భార్య నాతో వెన్నంటి ఉండి మద్దతు తెలపడం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఎన్నికల సమయంలో అమె ప్రజల ముందుకు ఎప్పుడూ రాలేదు. కానీ అన్ని వేళలా నాకు మద్దతుగా నిలిచారు’’ అని తన భార్య సునీతను ఉద్దేశించి కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడే ఉన్న సునీతను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.