ప్రాణం తీసిన సెల్ఫీ సరదా | Teen dies while taking selfie | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

May 10 2016 6:46 PM | Updated on Apr 7 2019 4:36 PM

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా - Sakshi

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

సెల్ఫీపై మోజు చెన్నైలో మరో ప్రాణాన్ని బలిగొంది.17 ఏళ్లకే ఓ బాలుడికి నూరేళ్లు నిండాయి. చెన్నై, కామరాజపురానికి చెందిన ప్రకాష్ (17) ప్లస్ వన్ చదువుతున్నాడు.

చెన్నై: సెల్ఫీపై మోజు చెన్నైలో మరో ప్రాణాన్ని బలిగొంది.17 ఏళ్లకే ఓ బాలుడికి నూరేళ్లు నిండాయి. చెన్నై, కామరాజపురానికి చెందిన ప్రకాష్ (17) ప్లస్ వన్ చదువుతున్నాడు. ఈ బాలుడికి వివిధ రకాలుగా సెల్ఫీలు  తీసుకోవడమంటే మహా పిచ్చి. ఈ నెల 8వ తేదీన తాంబరం రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న గూడ్సు రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు చెయ్యి పైకెత్తగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని కీల్‌పాక్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రకాష్ మంగళవారం మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement