మండపానికి పెట్రోల్‌తో వచ్చారు..! | Tamil Nadu Groom Friends Given Petrol As Marriage Gift | Sakshi
Sakshi News home page

వెరైటీ పెళ్లి కానుక..!

Sep 17 2018 12:15 PM | Updated on Sep 17 2018 1:35 PM

Tamil Nadu Groom Friends Given Petrol As Marriage Gift - Sakshi

నూతన వధూవరులకు పెట్రోల్‌ గిఫ్ట్‌ ఇస్తోన్న మిత్ర బృందం

చెన్నై : పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులు ఊరకనే రారు. నూతన దంపతులకు అవసరమయ్యే వస్తువును ఏదో ఒక దాన్ని బహుమతిగా ఇస్తారు. తమిళనాడుకు చెందిన కొందరు స్నేహితులు కూడా ఇలానే చేశారు. కానీ వారు ఇచ్చిన గిఫ్ట్‌ చూసిన వారు మాత్రం ఒక్క క్షణం నివ్వెరపోయారు.. అనంతరం తేరుకుని పడిపడి నవ్వారు.

పెళ్లి పందిరిలో ఇంతలా నవ్వులు పూచించిన ఆ గిఫ్ట్‌ ఏంటంటే ‘పెట్రోల్‌’.. అవును పెళ్లి బహుమతిగా వారు తమ స్నేహితునికి 5 లీటర్ల పెట్రోల్‌ని బహుకరించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కడలూర్‌లో  చోటుచేసుకుంది. పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ‘పెళ్లికానుక’గా పెట్రోల్‌ ఇస్తే బాగుంటుందని భావించినట్లు సదరు మిత్ర బృందం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement