
సాక్షి, న్యూఢిల్లీ : అశోక గజపతిరాజు మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పౌరవిమానయాన శాఖా మంత్రిగా సురేశ్ ప్రభు నియమితులయ్యారు. 2014 నుంచి 17 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేనను వదిలి 2014లో సురేశ్ ప్రభు బీజేపీలో చేరారు. ప్రస్తుతం వాణిజ్య శాఖామంత్రిగా పని చేస్తున్న ఆయనకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు.