ఉల్లిగడ్డలు మింగిన నాగుపాము.. వైరల్‌

Snake Swallows Onions in Odisha Video Viral - Sakshi

ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 11 ఉల్లిపాయలను మింగిందో నాగుపాము. అయితే రంగంలోకి దిగిన స్నేక్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది.. వాటిని కక్కించి పామును రక్షించాడు. ఒడిశాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. 

అంగుల్‌ జిల్లా చెండిపాడ గ్రామంలో నివసించే సుసంత బెహెరా ఇంట్లోకి నాగుపాము చొరబడింది. దీంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వారు స్థానికంగా ఉండే స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ వాలంటీర్‌ హిమాన్షు శేఖర్‌ దెహూరీకి కబురు పెట్టారు. ‘పామును పట్టుకోవాలని యత్నించినప్పుడు దాని పొట్టంతా ఉబ్బిపోయి ఉంది. అది ఒక్కో ఉల్లిపాయను కక్కుతూ వచ్చింది. అయితే అది అరుదైన దృశ్యం కాబట్టి ఫోన్‌తో రికార్డు చేయించాం. చివర్లో రెండు ఉల్లిపాయలు దాని నోటి నుంచి రావటం మీరూ ఆ వీడియోలో గమనించొచ్చు’ అని దెహూరీ చెబుతున్నాడు.      

అరుదైనదే... సాధారణంగా పాములు కప్పులు, పురుగుపుట్రతోపాటు కొన్నిసార్లు పండ్లు, కూరగాయాలను కూడా మింగుతాయి. కానీ, అది పొరపాటున ఉల్లిపాయలు మింగి ఉంటుంది. జీర్ణించుకోలేదు కాబట్టి పాపం అవస్థలు పడి బయటకు కక్కింది. అయితే ఏకంగా 11 ఉల్లిగడ్డలు మింగటం బహుశా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళలో ఓ పాము మాత్రం ఏడు గుడ్లను మింగి.. కక్కటం చూశాం’ అని స్నేక్‌ హెల్ప్‌లైన్‌ సెక్రెటరీ సుబేందు మాలిక్‌ చెబుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top