‘రామ మందిరం’ మధ్యవర్తిగా రవిశంకర్‌! | Shri Shri Ravi Shankar to mediate long-standing Babri Masjid-Ram ... | Sakshi
Sakshi News home page

‘రామ మందిరం’ మధ్యవర్తిగా రవిశంకర్‌!

Oct 28 2017 6:28 AM | Updated on Oct 28 2017 6:28 AM

Shri Shri Ravi Shankar to mediate long-standing Babri Masjid-Ram ...

న్యూఢిల్లీ: వివాదాస్పద రామ మందిర నిర్మాణంపై చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించాలని నిర్మోహి అఖాదా, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ పండిట్‌ రవిశంకర్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ధ్రువీకరిస్తూ, తాను కూడా ఇదే విషయమై అక్టోబర్‌ 20–15 మధ్య రవిశంకర్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌లో చేపట్టనుంది. చర్చలకు మధ్యవర్తిగా రవిశంకర్‌నే ఎంచుకోవడం ఎందుకని ప్రశ్నించగా...ఆయన జీవన విధానం, అన్ని మతాల పట్ల ఆయన అనుసరిస్తున్న ప్రేమపూరిత వైఖరే కారణమని స్వామి బదులిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement