నేను చనిపోయానని చూసి షాకయ్యా : కేంద్రమంత్రి | Shocked to see i am dead in Google search tweets Minister Babul Supriyo | Sakshi
Sakshi News home page

నేను చనిపోయానని చూసి షాకయ్యా : కేంద్రమంత్రి

Dec 18 2018 7:32 PM | Updated on Dec 18 2018 7:41 PM

Shocked to see i am dead in Google search tweets Minister Babul Supriyo - Sakshi

2011 డిసెంబర్‌ 30న నేను చనిపోయానని చూసి షాక్‌కు గురయ్యా

ప్రస్తుతం కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్న బబుల్‌ సుప్రియో 2011లోనే మృతిచెందినట్టు ఆయన పేరును గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే వచ్చింది. దీంతో ఈ విషయాన్ని నెటిజన్లు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన అవాక్కయ్యారు. గూగుల్‌ సెర్చ్‌లో వచ్చిన తప్పిదాన్ని గూగుల్‌ ఇండియా అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ని ట్యాగ్‌ చేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు.

'డీయర్‌ గూగుల్‌ ఇండియా, వ్యక్తిగతంగా నా గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేసి, 2011 డిసెంబర్‌ 30న నేను చనిపోయానని చూసి షాక్‌కు గురయ్యా. నేను బతికే ఉన్నానని మీకు లిఖితపూర్వకంగా ఇవ్వమంటారా. దేవుడి దయవల్ల నాకు తిరిగి ప్రాణం పోస్తారనుకుంటున్నా. జీవితం ఎంతో అందమైంది. పిక్చర్‌ అబీ బాకీ హై మేరే దోస్త్‌. నాకు ఇంకా బతకాలనుంది' అంటూ బబుల్‌ సుప్రియో ట్వీట్‌ చేశారు. అయితే మంత్రి ట్వీట్‌ చేసిన కొద్ది సమయానికే గూగుల్‌ సెర్చ్‌లో వచ్చిన తప్పిదాన్ని సరిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement