307 ఏళ్ల తమ అనుబంధాన్ని విడగొట్టవద్దంటూ బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కేమరూన్ స్కాట్‌లాండ్ ప్రజలను అభ్యర్థించారు.
స్కాట్‌లాండ్‌కు బ్రిటన్ పీఎం అభ్యర్థన
లండన్: 307 ఏళ్ల తమ అనుబంధాన్ని విడగొట్టవద్దంటూ బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కేమరూన్ స్కాట్‌లాండ్ ప్రజలను అభ్యర్థించారు. యునెటైడ్ కింగ్‌డమ్(యూకే) నుంచి విడిపోవడానికి సంబంధించి ఈ నెల 18న స్కాట్‌లాండ్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. యూకే నుంచి విడిపోవడానికే స్కాట్‌లాండ్ ప్రజలు మొగ్గుచూపుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. కేమరూన్ బుధవారం హుటాహుటిన స్కాట్‌లాండ్‌కు వెళ్లారు. ఇంగ్లండ్, స్కాట్‌లాండ్‌ల అనుబంధాన్ని విడగొట్టి.. యూకే కుటుంబా న్ని చీల్చొద్దని స్కాట్ ప్రజలను ఆయన అభ్యర్థించారు. ‘నా దేశాన్ని నా పార్టీ కన్నా ఎక్కువగా ప్రేమిస్తాను.
మనమంతా కలిసి నిర్మించుకున్న యూకే విడిపోవడం నేను భరించలేను’ అని ఎడిన్‌బరోలో కేమరూన్ వ్యాఖ్యానించారు. లేబర్ పార్టీ నేత ఎద్ మిలిబండ్, ఉపప్రధాని నిక్ క్లెగ్ లు స్కాట్‌లాండ్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా ఓటేయాలని అక్కడి ప్రజలను అభ్యర్థించారు.