ముగ్గురు టీచర్లు సస్పెండయ్యారు | Satyajit Ray institute teachers suspended over sexual harassment | Sakshi
Sakshi News home page

ముగ్గురు టీచర్లు సస్పెండయ్యారు

Dec 14 2015 6:12 PM | Updated on Jul 23 2018 9:13 PM

విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన 'సత్యజిత్ రే ఇన్ స్టిట్యూట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్'కు చెందిన ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేశారు.

కోల్కతా: విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన 'సత్యజిత్ రే ఇన్ స్టిట్యూట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్'కు చెందిన ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేశారు. విద్యార్థుల ఫిర్యాదుమేరకు తక్షణ చర్యలుగా వారిపై సస్పెండ్ వేటు వేశారు. 'ఇన్ స్టిట్యూట్ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఆ ముగ్గురు టీచర్లపై నమోదైన ఆరోపణలపై విచారణ జరుపుతోంది.

దీనిపై ఇప్పుడే మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' అని ఇన్ స్టిట్యూట్ రిజిస్ట్రార్ అనింద్యా ఆచార్య చెప్పారు. సినిమా విభాగానికి సంబంధించి మంచి నైపుణ్యం, మెళకువలు నేర్పించడంలో సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ పేరు గాంచిన విషయం తెలిసిందే. ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement