ఆర్‌టీఐ సవరణ బిల్లుకు ఆమోదం

RtI Amendment Act Passed By The Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ : సమాచార హక్కు (ఆర్‌టీఐ) సవరణ బిల్లు తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది. ఆర్‌టీఐని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం సవరణ బిల్లును ప్రతిపాదించిందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ బిల్లును ఆర్‌టీఐ నిర్మూలన బిల్లుగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ఈ బిల్లును తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్‌ కమిటీకి నివేదించాలని డిమాండ్‌ చేశాయి. ఈ బిల్లును ప్రభుత్వానికి తగినంత సంఖ్యా బలం లేని రాజ్యసభలో అడ్డుకునే అవకాశం ఉంటుందని విపక్షాలు ఆశిస్తున్నాయి.

రాష్ట్ర, కేంద్రస్ధాయిలో సమాచార కమిషనర్ల వేతనాలు, కాలపరిమితికి సంబంధించిన సవరణలకు బిల్లులో చోటుకల్పించారు. ఎన్నికల కమిషన్‌ అధికారుల స్ధాయిలో వారికి వేతనాలు ఇవ్వచూపడం, కాలపరిమితి వంటి అంశాలను ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా సవరణ బిల్లులో పొందుపరిచారు. ఆర్‌టీఐ చట్టంలో ప్రస్తుతం వీటికి సంబంధించిన నిబంధనల ప్రస్తావన లేదు. కాగా ఆర్‌టీఐ కమిషనర్ల విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా సవరణలు చేశారని విపక్షం ఆరోపించింది. ఆర్‌టీఐ చట్టాన్ని నీరుగార్చేలా ఈ నిబంధనలు ఉన్నాయని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top