 
															'రాజీనామాలు సమస్యకు పరిష్కారం కాదు'
													 
										
					
					
					
																							
											
						 రాజీనామాలు సమర్పించడం వలన సమస్యలకు పరిష్కారం లభించదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు.
						 
										
					
					
																
	న్యూఢిల్లీ: రాజీనామాలు సమర్పించడం వలన సమస్యలకు పరిష్కారం లభించదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో పార్టీ నేతలు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు సమర్పించడంపై మనీష్ స్పందించారు. 
	 
	కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారపోసిన వాళ్లు పార్టీలో ఉన్నారు. సమస్యలు రాజీనామాకు పరిష్కారం కాదు అని మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. 
	 
	రాజకీయాల్లో గెలుపు, ఓటములు చాలా సహజం. ఓటమికి కుంగిపోకూడదు.. ఓటమి కారణాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి విశ్లేషిస్తోంది. ఓటమి కారణాలపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయానికి వస్తుందన్నారు.