‘మతమార్పిడి చట్టం’ రాష్ట్రాల పరిధిలోనిది! | religion exchange comes under state issue | Sakshi
Sakshi News home page

‘మతమార్పిడి చట్టం’ రాష్ట్రాల పరిధిలోనిది!

Apr 16 2015 3:58 AM | Updated on Sep 3 2017 12:20 AM

మత మార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించడం పూర్తిగా రాష్ట్రాల అధికార పరిధిలోని అంశమని, దానిపై కేంద్రం చట్టం చేయడం కుదరదని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది.

  • ‘హోం’కు న్యాయశాఖ స్పష్టీకరణ
  • న్యూఢిల్లీ: మత మార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించడం పూర్తిగా రాష్ట్రాల అధికార పరిధిలోని అంశమని, దానిపై కేంద్రం చట్టం చేయడం కుదరదని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ అభ్యర్థనపై న్యాయశాఖ ఈ విషయంపై వివరణ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ కేంద్రం సంబంధిత చట్టం చేయాలనుకుంటే దానికి చట్టబద్ధత ఉండకపోవడమే కాకుండా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అది విరుద్ధమవుతుందని న్యాయశాఖ తేల్చి చెప్పినట్లు వివరించాయి.

    మతమార్పిడి నిషేధ చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడం, దానిపై విపక్షాలు కలసివస్తే మతమార్పిడి నిరోధక చట్టం చేసేందుకు సిద్ధమని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించడం తెలిసిందే. దీంతో హోంశాఖ మతమార్పిడి చట్టం సాధ్యాసాధ్యాలపై న్యాయశాఖ వివరణ కోరింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement