‘పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను తగ్గించండి’ | 'Reduce excise tax on petrol and diesel' | Sakshi
Sakshi News home page

‘పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను తగ్గించండి’

Jan 24 2018 1:25 AM | Updated on Jan 24 2018 1:25 AM

'Reduce excise tax on petrol and diesel' - Sakshi

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో వాటిపై ఎక్సైజ్‌ పన్నును తగ్గించాల్సిందిగా ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరింది. లీటర్‌ పెట్రోల్‌ ధర మంగళవారం ఢిల్లీలో రూ.72.38గా ఉంది. ముంబైలో ఇటీవల రూ.80 దాటిపోయింది.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంత ధర ఎప్పుడూ లేదు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లోనే ఎక్సైజ్‌ పన్నును తగ్గించాలంటూ పెట్రోలియం శాఖ ఆర్థిక శాఖను కోరింది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వమే రూ.19.48 ఎక్సైజ్‌ పన్నును వసూలు చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement