హిట్‌ లిస్టులో దబోల్కర్‌ కుమార్తె | Rationalist Narendra Dabholkar's Daughter Was On Maha Terror Hit List | Sakshi
Sakshi News home page

హిట్‌ లిస్టులో దబోల్కర్‌ కుమార్తె

Sep 2 2018 4:53 AM | Updated on Sep 2 2018 5:00 AM

Rationalist Narendra Dabholkar's Daughter Was On Maha Terror Hit List - Sakshi

ముంబై: పుణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్‌ కుమార్తె ముక్తా దబోల్కర్‌ హిందుత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో ఉన్నట్లు మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్‌) తెలిపింది. సామాజిక కార్యకర్త శ్యాం మానవ్, ఎన్‌సీపీ నేత జితేంద్ర అహ్వద్‌ తదితరుల పేర్లు హిట్‌ లిస్టులో ఉన్నట్లు ఏటీఎస్‌ పేర్కొంది.

ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై గత వారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన హిందుత్వ తీవ్రవాది అవినాష్‌ పవార్‌పై కోర్టుకి సమర్పించిన డైరీలో ఏటీఎస్‌ ఈ విషయాలు తెలిపింది. హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న ముక్తాæ తదితరులపై అవినాష్‌ నిఘా పెట్టి, వెంబడించినట్టు స్థానిక సెషన్స్‌ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement