రజనీ కూతురు, అల్లుడి పాస్‌పోర్టు మాయం

Rajinikanth Daughter And Son In Laws Passports Stolen - Sakshi

సాక్షి, చెన్నై : నటుడు రజనీకాంత్‌ రెండవ కూతురు, దర్శకురాలు సౌందర్య, ఆమె భర్త విశాకన్‌ పాస్‌పోర్టు మాయమైంది. విశాకన్, సౌందర్యరజనీకాంత్‌ మూడు రోజుల కిందట ఎమరాల్డ్స్‌ విమానంలో చెన్నై నుంచి లండన్‌కు వెళ్లారు. లండన్‌లో విమానం దిగగానే సెక్యూరిటీ అధికారులకు పాస్‌పోర్టు చూపించడానికి దాన్ని భద్రపరిచిన సూట్‌కేస్‌ కోసం వెతకగా కనిపించలేదు. సూట్‌కేస్‌లో అశోకన్, సౌందర్యరజనీకాంత్‌లకు చెందిన పాస్‌పోర్టులు, సహా రూ.లక్షల అమెరికన్‌ డాలర్లు ఉన్నాయట. దీంతో అశోకన్, సౌందర్యరజనీకాంత్‌ విమానాశ్రయంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సెక్యూరిటీ అధికారులకు తమ పాస్‌పోర్టులను చూపకపోవడంతో ఆ అధికారులు వారిని విమానాశ్రయ విశ్రాంతి గదికి పంపారు. ఈ విషయం అక్కడి భారతీయ రాయబారులకు, నటుడు రజనీకాంత్‌కు తెలియజేశారు. తాత్కాలిక పాస్‌పోర్టులను ఏర్పాటు చేయయడంతో అశోకన్, సౌందర్యరజనీకాంత్‌లను లండన్‌ విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు పంపివేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top