వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్లాట్‌ఫాం టికెట్ల రేట్లను రైల్వేశాఖ పెంచనుంది.
న్యూఢిల్లీ: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్లాట్‌ఫాం టికెట్ల రేట్లను రైల్వేశాఖ పెంచనుంది. ప్రస్తుతం రూ.5గా ఉన్న ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10కి పెంచనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరిగిన ధరలతో కూడిన టికెట్లను అన్ని రైల్వే స్టేషన్లకు సకాలంలో సరఫరా చేయాలని జోనల్ రైల్వేలను రైల్వే శాఖ ఆదేశించింది. రేట్ల పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా ఆధునీకరిస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది. ర్యాలీలు, ఉత్సవాల సందర్భంలో ప్లాట్‌ఫాంలపై రద్దీని నియంత్రించేందుకు టికెట్ రేట్లను పది రూపాయలకంటే ఎక్కువగా పెంచేందుకు డివిజినల్ రైల్వే మేనేజర్లకు రైల్వేశాఖ అధికారం కల్పించింది.