అందుకే ప్రధాని నా కళ్లలోకి చూడలేరు.. | Rahul continued His Attack On Narendra Modi Over Rafale Deal | Sakshi
Sakshi News home page

అందుకే ప్రధాని నా కళ్లలోకి చూడలేరు..

Aug 13 2018 3:06 PM | Updated on Aug 15 2018 2:37 PM

Rahul continued His Attack On Narendra Modi Over Rafale Deal - Sakshi

ప్రధాని నా కళ్లలోకి సూటిగా చూడలేరు ఎందుకంటే..


సాక్షి, బెంగళూర్‌ : రాఫెల్‌ డీల్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మరోసారి టార్గెట్‌ చేశారు. దొంగతనానికి పాల్పడిన వారు తన కళ్లలోకి చూడలేరని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఫ్రాన్స్‌తో జరిగిన విమాన ఒప్పందంపై తాను ప్రసంగించిన సంగతి ప్రస్తావిస్తూ ఆ సమయంలో ప్రధాని నేరుగా తన కళ్లలోకి చూడలేకపోయారని ఎద్దేవా చేశారు.

కర్ణాటకలోని బీదర్‌లో సోమవారం జరిగిన ర్యాలీనుద్దేశించి రాహుల్‌ మాట్లాడారు. రాఫెల్‌ ఒప్పందంనపై సమగ్ర చర్చకు రాహుల్‌ ప్రధాని మోదీకి సవాల్‌ విసిరారు. రాఫెల్‌ డీల్‌పై ఎన్ని గంటలు చర్చించినా ప్రధాని ఒక్క క్షణం కూడా దానిపై మాట్లాడలేరని రాహుల్‌ ఆరోపించారు. మోదీ సర్కార్‌ బ్యాంకు స్కాంలు, రాఫెల్‌ కుంభకోణం వంటి పలు స్కాంలతో అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement