పుట్టన్న ఏకగ్రీవం | puttanna elected as unanimous | Sakshi
Sakshi News home page

పుట్టన్న ఏకగ్రీవం

Jul 16 2014 4:09 AM | Updated on Sep 2 2017 10:20 AM

పుట్టన్న ఏకగ్రీవం

పుట్టన్న ఏకగ్రీవం

మండలి డిప్యూటీ చైర్మన్‌గా జేడీఎస్‌కు చెందిన పుట్టన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే చైర్మన్ శంకరమూర్తి ఎన్నికను చేపట్టారు.

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మండలి డిప్యూటీ చైర్మన్‌గా జేడీఎస్‌కు చెందిన పుట్టన్న ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే చైర్మన్  శంకరమూర్తి ఎన్నికను చేపట్టారు. జేడీఎస్‌కు చెందిన బసవరాజ హొరట్టి, మరి తిబ్బేగౌడ, ఈ. కృష్ణప్పలు  ప్రతిపాదించగా, అదే పార్టీకి చెందిన సందేశ్ నాగరాజ్, డీయూ. మల్లిఖార్జున్, చౌడ రెడ్డిలు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటుతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ ప్రకటించారు.

Advertisement

పోల్

Advertisement