కొత్త మార్గాల్లో... ఉడాన్‌  | Plane Connectivity to 8 new cities from Hyderabad | Sakshi
Sakshi News home page

కొత్త మార్గాల్లో... ఉడాన్‌ 

Jan 27 2019 2:51 AM | Updated on Jan 27 2019 9:11 AM

Plane Connectivity to 8 new cities from Hyderabad - Sakshi

ప్రాంతీయ అనుసంధాన పథకం ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌ (ఉడాన్‌) ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విమాన ప్రయాణ సౌకర్యం కలగనుంది. ఉడాన్‌ మూడో రౌండ్‌ బిడ్డింగ్‌లో ఎంపిక చేసిన విమాన ప్రయాణ మార్గాల ద్వారా తెలంగాణ, ఏపీ నుంచి మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 235 రూట్లను కేంద్ర పౌర విమానయాన మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

ఈసారి పర్యాటక శాఖ సహకారంతో పలు ప్రాంతాలను ఉడాన్‌లో ఎంపిక చేశారు. 6 వాటర్‌ ఏరోడ్రమ్స్‌ ద్వారా కొత్తగా 18 రూట్లలో సీప్లేన్స్‌కు కూడా అనుమతించారు. వీటిలో తెలంగాణలోని నాగార్జునసాగర్‌ వాటర్‌ ఏరో డ్రమ్‌ కూడా ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు, విజయవాడకు విమానయాన సౌకర్యం ఏర్పడనుంది. ఈ మార్గాన్ని టర్బో ఏవియేషన్‌కు 
కేటాయించారు.  
–సాక్షి, న్యూఢిల్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement