ఐపీఎల్‌పై హైకోర్టులో పిల్ | PIL filed in Karnataka HC seeking shifting of IPL matches | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌పై హైకోర్టులో పిల్

Apr 11 2016 8:32 PM | Updated on Aug 31 2018 8:24 PM

ఐపీఎల్‌పై హైకోర్టులో పిల్ - Sakshi

ఐపీఎల్‌పై హైకోర్టులో పిల్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌ల విషయమై కర్ణాటక హైకోర్టులో సోమవారం ప్రజాహిత వాజ్యం దాఖలైంది.

బెంగళూరు : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌ల విషయమై కర్ణాటక హైకోర్టులో సోమవారం ప్రజాహిత వాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల తాగునీటి విషయమై ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అయితే ఐపీఎల్ కోసమంటూ ఎక్కువ పరిమాణంలో నీటిని స్టేడియంలోని పిచ్‌లను తడపడం సరికాదంటూ నగరానికి చెందిన శ్రీనివాస్‌శర్మ అనే అర్చకుడు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

అంతేకాకుండా సదరు నీటిని కూడా జలమండలి అక్రమంగా సరఫరా చేస్తోందని ఫిర్యాదుదారుడు న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల చిన్నస్వామి స్టేడియంకు వినియోగించే నీటిపై ఆడిట్‌ను జరపాల్సిన అవసరం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement