లీకైన సన్నీ లియోన్‌ ఫోన్‌ నంబర్‌..? | People Are Calling Puneet They Think That Number Is Sunny Leone | Sakshi
Sakshi News home page

అసభ్య సందేశాలు, కాల్స్‌తో విసిగిపోతున్న ఢిల్లీవాసి

Jul 30 2019 7:14 PM | Updated on Jul 30 2019 7:35 PM

People Are Calling Puneet They Think That Number Is Sunny Leone - Sakshi

న్యూఢిల్లీ: సెలబ్రిటీ నంబర్‌ అంటూ మీ ఫోన్‌ నంబర్‌ను లీక్‌ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. రోజంతా విపరీతంగా కాల్స్‌, మెసేజ్‌లతో బుర్ర బద్దలవుతుంది. ఢిల్లీకి చెందిన పునీత్‌ అగర్వల్‌కు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సన్నీ లియోన్‌ నంబర్‌ అంటూ పునీత్‌ నంబర్‌ను లీక్‌ చేశారు. ఇంకేముంది ఓ వారం రోజుల నుంచి ఒకటే ఫోన్లు, అసభ్య సందేశాలట. విసిగి పోయిన పునీత్‌.. ‘అర్జున్‌ పటియాలా’ సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతనికి కాల్స్‌ వస్తే.. సినిమా మీద ఫిర్యాదు చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే ఉంది అసలు విషయం.

సన్నీ లియోన్ నటించిన 'అర్జున్ పటియాలా' సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో వచ్చే ఓ సన్నివేశంలో సన్నీ, పోలీస్ అధికారికి తన తన ఫోన్ నంబర్ ఇస్తుంది. దురదృష్టం కొద్ది ఆ నంబర్‌ కాస్త​ పునీత్‌ది కావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ నంబర్ నిజంగా సన్నీదే అని చాలామంది నోట్ చేసేసుకున్నారు. చేసుకోవడమే కాదు.. ఆ నంబర్‌కు ఫోన్ చేసి సన్నీ మేడమేనా మాట్లాడేది? అంటూ ఆరా తీశారు. కాదని బదులిస్తే.. అసభ్యకరంగా తిడుతూ ఫోన్ పెట్టేసేవారు. ఇలా దాదాపు రోజుకు 100-200 కాల్స్‌, అసభ్య సందేశాలు రావడంతో విసిగి పోయిన పునీత్‌ పోలీసులను ఆశ్రయించాడు. కానీ ఈ విషయంలో వారు కూడా ఏం చేయలేకపోవడంతో.. కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నాడు.

సాధరణంగా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాల్లో వాడుకలో లేని ఫోన్‌ నంబర్లను ఇవ్వడం పరిపాటి. కానీ ఇందుకు విరుద్ధంగా చిత్రంలో పునీత్‌ నంబర్‌ను వాడారు. దాంతో అప్పటి నుంచి అతడికి కష్టాలు ప్రారంభమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement