అన్ని పార్టీలు సహకరించాలి: ప్రధాని మోదీ | parliament sessions started | Sakshi
Sakshi News home page

అన్ని పార్టీలు సహకరించాలి: ప్రధాని మోదీ

Apr 25 2016 11:14 AM | Updated on Aug 15 2018 2:20 PM

అన్ని పార్టీలు సహకరించాలి: ప్రధాని మోదీ - Sakshi

అన్ని పార్టీలు సహకరించాలి: ప్రధాని మోదీ

మలివిడత పార్లమెంట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

న్యూఢిల్లీ: మలివిడత పార్లమెంట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది. పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగే సూచనలు ఉన్నాయి.

రాజ్యసభలో ఉత్తరాఖండ్ రాజకీయ పరిణామాలపై చర్చించాలని జేడీయూ నోటీసు ఇవ్వగా, ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్పై చర్చజరగాలని బీజేపీ పట్టుబడుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం సీనియర్ మంత్రులతో సమావేశయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని మోదీ కోరారు. ఇదిలావుండగా, ఈ రోజు సాయంత్రం ఎథిక్స్ కమిటీ సమావేశంకానుంది. బ్యాంకు రుణాలను చెల్లించకుండా విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మల్యా వ్యవహారంపై చర్చించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement