కేజ్రీవాల్, సిసోడియా దిష్టిబొమ్మలు దగ్ధం | Pakistani Hindus burn effigies of Arvind Kejriwal, Manish Sisodia | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్, సిసోడియా దిష్టిబొమ్మలు దగ్ధం

Jan 7 2014 9:14 PM | Updated on Mar 23 2019 8:37 PM

కేజ్రీవాల్, సిసోడియా దిష్టిబొమ్మలు దగ్ధం - Sakshi

కేజ్రీవాల్, సిసోడియా దిష్టిబొమ్మలు దగ్ధం

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనీష్ సిసోడియా దిష్టిబొమ్మలను పాకిస్థాన్ కు చెందిన పలువురు హిందువులు దగ్ఘం చేశారు.

సరైన పునరావాసం కల్పించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనీష్ సిసోడియా దిష్టిబొమ్మలను పాకిస్థాన్ కు చెందిన పలువురు హిందువులు దగ్ధం చేశారు. విశ్వహిందు పరిషత్ (వీహెచ్ పీ) మద్దతుతో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
పునారావాస కేంద్రాల్లో కొద్ది నెలలుగా తలదాచుకుంటున్న తమను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక తమ సమస్యలను కేజ్రివాల్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపించారు. 
 
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో తాము ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపులలో సుమారు 800 మంది హిందువులు పునారావసం పొందుతున్నారని వీహెచ్ పీ ప్రతినిధి రాజీవ్ గుప్తా తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement