breaking news
burn effigies
-
సీఎం సోరెన్ రాజీనామా చేయాల్సిందే
రాంచీ: జార్ఖండ్లో ఉద్యోగ నియామక పక్రియల్లో అక్రమాలకు చరమగీతం పాడాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనోద్యమం ఆదివారం 23వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో జేఎంఎం–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లపై నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పరీక్షార్థులు ఆరోపించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈనెల 20న రాంచీలో హేమంత్ సోరెన్ నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. ఒకవేళ రాహుల్ గాంధీ మాటను ముఖ్యమంత్రి వినకపోతే జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకోవాలని జేపీఎస్సీ–జీఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తేల్చిచెప్పారు. విద్యార్థుల డిమాండ్లను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలని సీఎంకు ప్రతిపక్ష నాయకుడు బాబూలాల్ మరాండీ సూచించారు. మరోవైపు పరీక్షల విధానంలో సంస్కరణలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించడానికి జార్ఖండ్ ప్రభుత్వం ‘స్టూడెంట్స్ వాయిస్ విత్ స్టూడెంట్స్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరోవైపు ఉద్యమనేతలు, ప్రభుత్వం మధ్య సోమవారం మధ్యాహ్నం మరోదఫా చర్చలు జరగనున్నాయి. -
కేజ్రీవాల్, సిసోడియా దిష్టిబొమ్మలు దగ్ధం
సరైన పునరావాసం కల్పించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనీష్ సిసోడియా దిష్టిబొమ్మలను పాకిస్థాన్ కు చెందిన పలువురు హిందువులు దగ్ధం చేశారు. విశ్వహిందు పరిషత్ (వీహెచ్ పీ) మద్దతుతో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పునారావాస కేంద్రాల్లో కొద్ది నెలలుగా తలదాచుకుంటున్న తమను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక తమ సమస్యలను కేజ్రివాల్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపించారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో తాము ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపులలో సుమారు 800 మంది హిందువులు పునారావసం పొందుతున్నారని వీహెచ్ పీ ప్రతినిధి రాజీవ్ గుప్తా తెలిపారు.


