ఆ వాహనాల విక్రయాలను ఆపేయాలి

Non-compliant BS-VI vehicles sale, manufacturing should stop from 2020 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ స్టేజ్‌(బీఎస్‌)–6 నాన్‌ కంప్లెయింట్‌ వాహనాల తయారీ, విక్రయాలను 2020 ఏప్రిల్‌ నుంచి దేశంలో నిలిపివేయాలని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. శుద్ధి చేసిన బీఎస్‌–6 ఇంధనాన్ని వాడటం వల్ల ఒనగూరే పర్యావరణ ప్రయోజనం ఈ వాహనాల వల్ల దక్కడం లేదని తెలిపింది. రాజధానిలో వాయు కాలుష్యం పెరిగిపోతుండటంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. డీజిల్‌ ధరను వేరుగా నిర్ణయించటం లేదా ప్రైవేట్‌ వాహనాలకు ప్రత్యేక ఇంధన ధరల విధానాన్ని ఏర్పాటు చేయటం సాధ్యం కాదని కోర్టుకు కేంద్రం వివరించింది. మార్చి 2020 వరకు తయారైన వాహనాల రిజిస్ట్రేషన్‌కు జూన్‌ 2020 వరకుగడువుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top