మంత్రికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ | Non-bailable warrant issued against UP minister | Sakshi
Sakshi News home page

మంత్రికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ

Apr 11 2015 12:10 PM | Updated on Oct 17 2018 6:34 PM

ఉత్తర్ ప్రదేశ్ విద్యుత్ శాఖామంత్రి యాసిర్ షాకు శుక్రవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

లక్నో:   ఉత్తర్ ప్రదేశ్ విద్యుత్ శాఖమంత్రి యాసిర్ షాకు   నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.   ఒక  కేసు విచారణకు హాజరు కాకుండా, సమన్లను సైతం ధిక్కరించిన మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన  చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్  బర్బాంకీ సర్వజీత్ శుక్రవారం ఈ  వారెంట్ను జారీ చేశారు.

అధికారుల సమాచారం  ప్రకారం... 2007లో ఒక  వ్యక్తిని గృహ నిర్బంధం చేసినట్లు మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయంలో పలుమార్లు సమన్లు జారీ అయిప్పటికీ , ఆయన కోర్టుకు గైర్హాజరవుతూ వచ్చారు.  ఈ నేపథ్యంలోనే మంత్రి యాసిర్తో సహా 32మందికి  నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.  మే12, 13ల్లో జరిగే విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

కాగా  భారీ ఎత్తున మత్తు మందులు కలిగి ఉన్నాడనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అక్రమంగా నిర్బంధంలో ఉంచిన  కేసులో పలువురు పోలీసులు సహా, మంత్రి యాసీర్ షాపై  నాన్పరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement