మోదీ ఉన్నాడు... రెండాకుల గుర్తు మాదే | nobody can shake AIADMK | Sakshi
Sakshi News home page

మోదీ ఉన్నాడు... రెండాకుల గుర్తు మాదే

Oct 21 2017 3:16 PM | Updated on Aug 15 2018 6:34 PM

nobody can shake AIADMK - Sakshi

సాక్షి, చెన్నై : వివాదంలో ఉన్న రెండాకుల గుర్తు తమకే వస్తుందనే విశ్వాసాన్ని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర శనివారం వ్యక్తం చేశారు. ముఖ్యమం‍త్రి పళనిస్వామి వర్గానికి చెం‍దిన రాజేంద్ర.. శనివారం ఆండిపట్టిలో పార్టీ సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తమ వెంటే ఉన్నారని.. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేను ప్రతిపక్ష డీఎంకే సహా ఎవ్వరూ ఏమీ చేయలేరని రాజేంద్ర పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం దగ్గరున్న రెండాకుల గుర్తు ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికే లభిస్తుందని ఇందులో ఎవరూ ఎటువంటి సందేహాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార అన్నాడీఎంకే వెంట 92 శాతం మంది శాసనసభ సభ్యుల మద్దతు ఉందని ప్రకటించారు.

జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలుగా చీలిపోయింది. అదే సమయంలో ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో పార్టీ గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిషేధించింది. ప్రస్తుతం పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు రెండు కలిసిపోవడంతో రెండాకుల గుర్తుపై ఇర ఎటువంటి సమస్య లేదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement