‘ప్రధాని రేసులో లేను’ | Nitin Gadkari Says No interest In Being PM Face | Sakshi
Sakshi News home page

‘ప్రధాని రేసులో లేను’

Dec 21 2018 8:50 AM | Updated on Mar 29 2019 5:57 PM

 Nitin Gadkari Says No interest In Being PM Face - Sakshi

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (ఫైల్‌ఫోటో)

ప్రధాని పదవిపై మోజు లేదన్న నితిన్‌ గడ్కరీ

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ స్ధానంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా తాను ముందుకు రాబోనని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం తానున్న స్ధానం తనకు సంతృప్తికరంగా ఉందని..ఇక ప్రధాని రేసులో ఉండాల్సిన పనిలేదని పేర్కొన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే నితిన్‌ గడ్కరీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని మహారాష్ట్రకు చెందిన రైతు నేత, వసంత్‌రావు నాయక్‌ సేఠి స్వావలంబన్‌ మిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ తివారీ ఆరెస్సెస్‌ చీఫ్‌కు లేఖ రాయడాన్ని ప్రస్తావించగా నితిన్‌ గడ్కరీ ఈ మేరకు స్పందించారు.

తాను తొలుత గంగా నదీ ప్రక్షాళన పనులు పూర్తిచేయాలని, రహదారి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని, ఈ పనులను పూర్తిచేసేందుకు సమయం వెచ్చించాల్సి ఉందని గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రధాని అభ్యర్థిత్వంపై తనకు ఆసక్తి లేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement