పెన్షనర్లు, ఏటీఎంలకు కొత్త నియమాలు | New rules for ATMs pensioners from May 1 | Sakshi
Sakshi News home page

పెన్షనర్లకు, ఏటీఎంలకు కొత్త నియమాలు

May 1 2020 11:51 AM | Updated on May 1 2020 12:45 PM

New rules for ATMs pensioners from May 1 - Sakshi

సాక్షి, ముంబై: కరోనావైరస్  సంక్షోభం, దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్  నేపథ్యంలో నేటి (మే 1 ) నుంచి  పెన్షనర్లు, ఏటీఎం నిబంధనలు మారనున్నాయి.  ముఖ్యంగా  పెన్షనర్లకు పూర్తి పేమెంట్ లభించనుంది. అలాగే ఏటీఎం వినియోగం ద్వారా యూజర్లకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని కఠిన నియమాలు పాటించాల్సి వుంటుంది.  (ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి)

చదవండి :  కరోనా : అయ్యయ్యో మారుతి!

పెన్షనర్లకు పూర్తి పెన్షన్ 

  • ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి ఈ రోజు నుంచి పూర్తి స్థాయి పెన్షన్  లభించనుంది.
  • దీంతో 6 లక్షల 30వేల మందికి  పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఫలితంగా ప్రభుత్వానికి 1,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
  • అలాగే కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి లాక్డౌన్ మధ్య సుమారు 6 లక్షల సంస్థలకు ఉపశమనం ఇస్తూ, ఒకేసారి బకాయిలు చెల్లించకుండా నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) రిటర్న్స్ దాఖలు చేయడానికి యజమానులకు అనుమతినిచ్చింది.

 ఏటీఎం కేంద్రాల శానిటైజేషన్

  • కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడానికి వీలుగా  కొన్ని నిబంధనలను ఆయా బ్యాంకులు కచ్చితంగా పాటించాలి. ఏటీఎంలను రోజూ శుభ్రం చేయడంతోపాటు వినియోగించిన ప్రతీసారీ శానిటైజ్ చేయాలి.  రోజుకు రెండు సార్లు ఏటీఎంలను శానిటైజర్‌తో క్లీన్ చేయాలి. 
  • మరీ ముఖ్యంగా  హాట్‌స్పాట్స్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు  ఈ నియమాలను  విధిగా పాటించాలి.  లేదంటే సదరు ఏటీఎంలను సీజ్ చేస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ , తమిళనాడు లోని  చెన్నైలలో ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement