సినిమా రైలు.. డ్రైవర్‌ లేకుండా పరుగులు తీసి!

Movie rail Engine Akbar derailed in Haryana - Sakshi

చంఢీగఢ్‌‌ : 20కి పైగా సినిమాల్లో ఉపయోగించిన రైలింజిన్‌ డ్రైవర్‌ లేకుండా రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించి పట్టాలు తప్పింది. హరియాణాలోని రెవారిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆ స్టీమ్‌ ఇంజిన్‌ పేరు అక్బర్‌. దీని ప్రత్యేకత ఏంటంటే.. సుల్తాన్‌, బాగ్‌ మిల్కా బాగ్‌, రంగ్‌ దే బసంతి సహా 20కి పైగా బాలీవుడ్‌ సినిమాల్లో ఈ రైలింజిన్‌ను వినియోగించడం గమనార్హం.​

ఉన్నతాధికారుల సందర్శనార్థం ఆదివారం అక్బర్‌ను బయటకు తీశారు. ఈ క్రమంలో 65 ఏళ్ల లోకో పైలెట్‌ (రైలు డ్రైవర్‌) ఇంజిన్‌ను స్టార్ట్‌ చేశాడు. బ్రేక్‌ లెవర్స్‌ జామ్‌ అయ్యాయని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే అదనపు డ్రైవర్‌తో కలిసి ఇంజిన్‌నుంచి దూకేశాడని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ తెలిపారు. రెండు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఇంజిన్‌ పట్టాలు తప్పినట్లు గుర్తించామని, త్వరలో మరమ్మతులు చేస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మొఘల్‌ రాజు అక్బర్‌ పేరు మీదుగా ఈ స్టీమ్‌ ఇంజిన్‌కు ఆయన పేరు పెట్టారు. భారత రైల్వేల్లో పురాతన స్టీమ్‌ రైలింజన్లలో ఒకటైన అక్బర్‌ను చిత్తరంజన్‌ లోకోమెటీవ్‌ వర్క్స్‌ తయారుచేయగా.. 1965 నుంచి సేవల్ని అందిస్తోంది. దూకేశాడు. పట్టాలు తప్పడంతో బాగా దెబ్బతిందని, మరమ్మతులకు బాగా ఖర్చు అవుతుందని అధికారులు వాపోతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top