కేరళకు మరిన్ని సహాయక బృందాలు

More Assistance To Kerala  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయక బృందాలను పంపింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన 5 మెడికల్‌ టీంలు, 2 కాలమ్‌లు(ప్రతీ కాలమ్‌లో 50 నుంచి 60 మంది సిబ్బంది ఉంటారు), 2 అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్లు, 2 చేతక్‌ హెలికాఫ్టర్‌లు సహాయంగా పంపించారు.

ఇండియన్‌ నేవీ నుంచి 10 రెస్క్యూ టీంలు, 10 మోటారు బోటులు, ఒక అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్‌, మరొక సీకింగ్‌ హెలికాఫ్టర్‌లు పంపారు. ఇండిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి రెండు ఎంఐ-17 హెలికాఫ్టర్లు, ఒక అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్‌లు పంపారు.ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నుంచి 6 మోటారు బోట్లు, 4 సాధారణ బోట్లు, 21 హైర్డ్‌ బోట్లులు పంపించారు. 

అలాగే ఐసీజీఎస్‌ విజిత్‌ నౌక ద్వారా 40 టన్నుల సహాయక సామగ్రి పంపించారు. నౌక ముంబై నుంచి కొచ్చికి ఇదివరకే బయలుదేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top