కరోనాకే సాధ్యం: హిస్టరీ రిపీట్స్‌! | Modi Cabinet Meeting Photo Viral On Social Media | Sakshi
Sakshi News home page

కరోనాకే సాధ్యం: హిస్టరీ రిపీట్స్‌!

Jun 5 2020 4:03 PM | Updated on Jun 5 2020 4:12 PM

Modi Cabinet Meeting Photo Viral On Social Media - Sakshi

వాట్సాప్‌లో వైరల్‌గా మారిన ఫొటో

అసాధ్యం అనుకున్న పనులెన్నిటినో కంటికి కనిపించని ఓ చిన్న వైరస్‌ సుసాధ్యం చేసింది.. ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమే నాలుగు గోడల మధ్య లాక్‌డౌన్‌ పేరిట లాక్‌ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు తమ పరిపాలనా పద్ధతిలో.. ప్రజలు తమ జీవనశైలిలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా భౌతిక దూరం ఓ అలవాటుగా మార్చుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారందరూ. రాజుల కాలం నాడు సభలు ఎలా జరిగేవో, వందల ఏళ్ల తర్వాత ప్రస్తుతం అదే పద్ధతిలో ప్రజా ప్రతినిధుల సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ( వైరల్‌ : నిజంగా ఇదో అద్భుతమైన థ్రిల్లర్!)

ప్రజా ప్రతినిధులు భౌతిక దూరాన్ని పాటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ‌ మంత్రి వర్గంతో భౌతికదూరం పాటిస్తూ సమావేశమైన ఓ ఫొటో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ కేబినెట్‌ సమావేశం ఫొటోకు రాజుల కాలం నాటి సభ ఫొటో జతచేసి ఉంది. ‘హిస్టరీ రిపీట్స్‌’ శీర్షికతో వాట్సాప్‌ గ్రూపుల్లో తెగ షేర్‌ అవుతోంది. ( గ‌ర్భిణీ ఏనుగును చంపింది ఇత‌డేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement