మరికొద్ది సేపట్లో ప్లాట్‌ఫాం నం..

Modernization in Indian Railways - Sakshi

దేశంలో రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా, సుఖవంతంగా మార్చే చర్యలు ఊపందుకున్నాయి. ఈ దిశలో చేపడుతున్న కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. గతంలోని ఇమేజీకి భిన్నంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నవీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అందివస్తున్న సాంకేతిక ఫలాల రూపంలో ప్రయాణికులు సౌకర్యాలు, ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రతి లోకో మోటివ్‌ ఇంజన్‌లో జీపీఎస్‌ పరికరాలు అమర్చడం మొదలు డేటా లాగర్స్‌ రైలు ప్రయాణ సమయ పర్యవేక్షణ, కృత్రిమ మేధ (ఆర్‌ఐ) ను ఉపయోగించి మెయింటెనెన్స్, అందుబాటులోని రైల్వే ఆస్తుల వినియోగం, పర్యవేక్షణ, సెన్సర్‌ ఆధారిత వ్యవస్థలతో కూడిన స్మార్ట్‌ కోచ్‌ల వినియోగం ఇలా అనేక అంశాల్లో నూతనత్వాన్ని సంతరించుకుంటోంది. ఇలాంటి నూతన ప్రణాళికల అమల్లో భాగంగా పలు ప్రా జెక్టులు చేపడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

అవేమిటంటే..

  • నిర్దేశిత సమయానికి రైళ్లు రాకపోకలు సాగించేలా గతంలో స్టేషన్‌ మాస్టార్లు రైళ్ల సమయాన్ని రికార్డు చేసే విధానానికి బదులుగా ఇంటర్‌ చేంజ్‌ పాయింట్లలోనే ఈ సమయం నమోదు చేసేందుకు డేటా లాగర్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా కంప్యూటర్‌లో రైళ్ల సమాచారం కనిపిస్తుంది. డేటా లాగర్స్‌ వల్ల గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 73–74 శాతం సమయపాలన పెరిగినట్లు రైల్వే మంత్రి చెబుతున్నారు. ప్రతి లోకోమోటివ్‌ ఇంజన్‌లో గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధంగా మొబైల్‌ ఫోన్‌లో ప్రతి రైలు ఎక్కడుందో తెలుసుకునే వీలుంటుంది. దీంతో ఎప్పటికప్పుడు రైలు గమనం.. ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైల్వేల విద్యుదీకరణ వల్ల ఏటా 200 కోట్ల డాలర్ల మేర ఆదా చేయొచ్చని రైల్వే శాఖ అంచనా. డీజిల్‌ ఇంజన్లకు మరమ్మతులు చేస్తారు. విద్యుత్‌ ఇంజన్లలను ఉపయోగించడం వల్ల కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది.
     
  • సమర్థతను పెంచుకునేందుకు వీలుగా ‘స్మార్ట్‌ టైం టేబుళ్లు’ అందుబాటులోకి రానున్నాయి.
     
  • ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే కృషి జరుగుతోంది. ప్రస్తుత రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచే చర్యలతో పాటు లక్షన్నర వరకున్న బ్రిడ్జీల స్థితిగతులను పరిశీలించి, వాటిని మరింత మెరుగ్గా చేస్తారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top