భార్య, కూతురు గొంతుకోసి, వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide after killing wife, daughter | Sakshi
Sakshi News home page

భార్య, కూతురు గొంతుకోసి, వ్యక్తి ఆత్మహత్య

Apr 4 2016 12:06 PM | Updated on Jul 29 2019 5:43 PM

భార్యాకూతురిని హత్యచేసి,అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

రాంచి:  జార్ఖండ్ లోని రాంచిలో  సోమవారం దారుణం  చోటు చేసుకుంది. భార్యా కూతురిని హతమార్చి, అనంతరం తానూ ఆత్మహత్య  చేసుకున్న ఘటన కలకలం రేపింది.  పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కళ్యాణ్ పుర్ కాలనీకి చెందిన వినయ్  గోరాయ్  ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ముందు భార్య, కుమార్తెను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement