'కర్ణాటక పోలీసు కాల్పుల్లో మృతులకు మమతా బెనర్జీ భరోసా'

Mamata Banerjee Helps Out Karnataka Victims - Sakshi

మంగళూరు : పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. మాట ఇచ్చిన 48 గంటల లోపే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం కర్ణాటకలోని మంగళూరు నగరంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెక్కులు అందజేసింది. మృతులు మొహమ్మద్ జలీల్, నౌషీన్‌ల కుటుంబాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది, నదీముల్లా హక్‌లు పరామర్శించారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు.

చదవండి: సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది!

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను వ్యతిరేకిస్తూ మంగళూరులో ఆందోళనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో జలీల్, నౌషీన్‌లు చనిపోయారు. ఆందోళనకారులు బందర్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది మాట్లాడుతూ.. ఇది మానవతా సాయం మాత్రమే. ఇందులో రాజకీయాలేమీ లేవు. ఇక్కడి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది కానీ ఇంతవరకూ ఇవ్వలేదు. అది పుండు మీద కారం చల్లటం వంటిదే. మమతా బెనర్జీ ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.

చదవండి: సిద్ధార్థ్ రాజకీయ ఎంట్రీపై సస్పెన్స్‌ వీడినట్టే..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top