గుర్రాలెక్కిన పెళ్లి కూతుళ్లు.. 

Madhya Pradesh Brides Ride Horses To Grooms Home - Sakshi

భోపాల్‌ : సాధారణంగా పెళ్లి వేడుకల్లో వరుడు గురాన్ని స్వారీ చేస్తూ కనిపిస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా ఇద్దరు పెళ్లి కూతుళ్లను గుర్రాలపై ఊరేగించారు. ఖండ్వకు చెందిన ఇద్దరు అక్కాచెల్లలు సాక్షి, సృష్టిల పెళ్లిలు జనవరి 22న జరిగాయి. అయితే వారి సంప్రాదాయం ప్రకారం అక్కాచెల్లలు ఇద్దరు.. గుర్రాలపై బయలుదేరి పెళ్లి కుమారుల ఇళ్లకు చేరుకున్నారు. అలాగే భారీ బరాత్‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా పెళ్లి కూతుళ్ల తండ్రి మాట్లాడుతూ.. సమాజంలో అబ్బాయిలతోపాటుగా అమ్మాయిలకు కూడా సమాన గౌరవం ఇవ్వాలన్నారు. పాటిదార్‌ కమ్యూనిటీలో పెళ్లి కూతుళ్లు గుర్రాలపై వెళ్లడమనే సంప్రాదాయం చాలా కాలంగా కొనసాగుతుందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భేటీ బచావో భేటీ పడావో’ కార్యక్రమా ముందుకు తీసుకెళ్లేలా తాము ఈ సంప్రాదాయాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ప్రతి వర్గం ఈ సంప్రాదాయాన్ని పాటించి.. కూతుళ్లకు గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top