‘ఆమె సన్యాసిని కాదు.. వేశ్య’

Kerala MLA PC George Calls Nun Who Accused Molested By Bishop As A Prostitute - Sakshi

తిరువనంతపురం : జలంధర్ కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్‌  2014- 2016 మధ్య కాలంలో క్రైస్తవ మహిళా సన్యాసిని (46) మీద 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తాజాగా కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్‌  ముక్కల్‌కు మద్దతు పలుకుతూ.. సన్యాసినిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయంలో ఎమ్మెల్యే జార్జ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆ సన్యాసిని వేశ్యగా అభివర్ణించాడు. ఆమె ఒక వ్యక్తితో రెండేండ్లుగా లైంగిక సంబంధాలు నడిపిందని, పవిత్రమైన సన్యాసినిగా ఉన్న ఆమెను వేశ్యనికాక, ఇంకేమని పిలవాలని ప్రశ్నించారు.

బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపిన్నారు. మరి 12 సార్లు శృంగారంలో పాల్గొని ఆనందించిన ఆమెకు 13 వ సారి మాత్రమే ఎందుకు అత్యాచారంగా అనిపించింది.. మొదటి సారి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. సన్యాసిని అంటే ఆమె కన్యగా ఉండాలి. ఆమెను సన్యాసినిగా పరిగణించలేమంటూ అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. సమాజంలో ప్రముఖుల పరువు తీయడానికే కొందరు మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, వారిలో ఆమె కూడా ఒకరని జార్జ్ ఆరోపించారు.కాగా జార్జ్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ తీవ్రంగా ఖండించారు. ఓ ప్రజా ప్రతినిధి అలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

మరోవైపు బిషప్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ క్రైస్తవ సన్యాసినిలు కోచిలో ఆందోళనలు నిర్వహించారు. సిస్టర్ అల్ఫై ఎంజే, సిస్టర్ అన్నే జైసీ, సిస్టర్ నీనా రోజ్ ఎంజే, సిస్టర్ జోసెఫ్ ఎంజే, సిస్టర్ నీనా జోస్‌లు నిరసన చేపట్టిన ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్ట్ చేయాలని కోరారు. ఆధారాలతో సహా బాధితురాలు ఫిర్యాదు చేసి 74 రోజులైనా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top