దరువేస్తూ చిందేస్తూ సీఎం డ్యాన్స్‌ అదుర్స్‌ | Karnataka CM Siddaramaiah Dance | Sakshi
Sakshi News home page

దరువేస్తూ చిందేస్తూ సీఎం డ్యాన్స్‌ అదుర్స్‌

Feb 26 2018 5:46 PM | Updated on Feb 26 2018 7:56 PM

Karnataka CM Siddaramaiah Dance - Sakshi

డప్పు వాయిస్తున్న రాహుల్‌, డప్పు వాయిస్తూ చిందేస్తున్న సీఎం సిద్ద రామయ్య

సాక్షి, బెంగళూరు : జాతీయ పార్టీల అధ్యక్షుల రాకతో కర్ణాటక కళకళ లాడుతోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో అడుగుపెట్టి కాంగ్రెస్‌పై, సీఎం సిద్దరామయ్యపై తీవ్ర విమర్శలు చేస్తుండగా తాజగా, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రంగంలోకి దిగారు.

సోమవారం కర్ణాటక వచ్చిన ఆయన గోడచిలోని వీరభద్ర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బెలగావిలోని సౌందట్టి ప్రాంతంలో యల్లమ్మ ఆలయం సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ, సీఎం సిద్ద రామయ్య సాంప్రదాయ డప్పులపై దరువులు వేశారు. దరువు వేసే క్రమంలో తన ఊపును ఆపుకోలేక సిద్ద రామయ్య చిందేశారు. దరువేస్తూ చిందేస్తున్న సిద్దరామయ్య ఆ వీడియో ఇప్పుడు హల్‌చల్‌ అయింది. ఒకసారి మీరు ఆ వీడియోను చూడండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement