జియో ప్రైమ్‌ గడువు పెంపు?? | jio prime membership offer extended to april end | Sakshi
Sakshi News home page

జియో ప్రైమ్‌ గడువు పెంపు??

Mar 25 2017 6:56 PM | Updated on Sep 5 2017 7:04 AM

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో తన దూకుడును కొనసాగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది.

ముంబై: టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో తన దూకుడును కొనసాగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఉచిత కాల్స్‌, డేటా ఆఫర్లతో సంచలనం సృష్టిచింది. తన వినియోగదారులకు అందించిన ఉచిత జియో హ్యాపీ న్యూఇయర్‌ ఆఫర్‌ మార్చి 31తో ముగియబోతోంది. దీని తర్వాత ఏడాదిపాటు ఉచిత సర్వీసులు కావాలంటే రూ.99తో జియో ప్రైమ్‌ సభ్యత్వం తీసుకోవాలి. అయితే ఈ సభ్యత్వం గడువు కూడా మార్చి 31తో ముగియనుంది.

అయితే వినియోగదారుల సంఖ్య పెంచుకోవడానికి జియో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో నెలరోజులు పాటు ప్రైమ్‌ సభ్యత్వ గడువును పెంచి ఎక్కువ మొత్తంలో చందాదారులను చేర్చుకోవాలని భావిస్తోంది. అంటే ఏప్రిల్‌ 30లోపు రూ.99చెల్లించి ప్రైమ్‌ మెంబర్షిప్‌ పొందొచ్చు. ఇప్పటికే ఉచిత ఆఫర్లతో తమ వ్యాపారాలను భారీగా దెబ్బతీశాయని ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌లు పలుసార్లు ట్రాయ్‌కి ఫిర్యాదులు చేస్తున్నాయి. దీనిపై ఇతర టెలికాం సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement