ములాయం చీఫ్గా జనతా పరివార్ ఏర్పాటు | janata parivar party hasbeen formed, mulayam will be chief | Sakshi
Sakshi News home page

ములాయం చీఫ్గా జనతా పరివార్ ఏర్పాటు

Apr 15 2015 5:34 PM | Updated on Jul 30 2018 8:10 PM

ములాయం చీఫ్గా జనతా పరివార్ ఏర్పాటు - Sakshi

ములాయం చీఫ్గా జనతా పరివార్ ఏర్పాటు

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరు పార్టీల విలీనంతో జనతా పరివార్ పార్టీ ఏర్పడింది.

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరు పార్టీల విలీనంతో జనతా పరివార్ పార్టీ ఏర్పడింది. గతంలో జనతా పార్టీ నుంచి విడిపోయిన సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్, ఐఎన్‌ఎల్‌డీ, సమాజ్‌వాదీ జనతా పార్టీలు తిరిగి ఒకే గూటి కిదికి చేరాయి.   కొత్తగా ఏర్పడిన పార్టీకి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ ములాయం సింగ్ నేతృత్వం వహిస్తారు. ఎన్నికల గుర్తును తర్వరలో ప్రకటించనున్నారు.

బుధవారం ఢిల్లీలోని ములాయం సింగ్ నివాసంలో సమావేశం అనంతరం పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని నేతలు అధికారికంగా వెల్లడించారు.  ఈ సమావేశానికి బీహార్  ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శరద్ యాదవ్, కేసీ త్యాగి, హెచ్డి దేవెగౌడ, లాలూ ప్రసాద్, కమల్ మొరార్క, దుష్యంత్  చౌతాల,రాంగోపాల్ యాదవ్ తదితర కీలక నేతలు హాజరయ్యారు. మతతత్వ శక్తులను నిలువరించడమే తమ ప్రధాన లక్ష్యమని, నవంబర్ లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నమని నేతలు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement